Chukka Sattaiah

No photo description available.

Welcome to Shri Chukka Sattaiah’s Website.

Oggu Katha performer, who brought national recognition to the traditional Telangana folk art and in the process earned a Sangeet Natak Akademi Award and a PhD (honoris causa), Chukka Sattaiah born in the Manikyapuram village in Lingala Ghanpur in the district.

Born on March 299, 1935, Mr. Chukka Sattaiah learned his art from his father Agaiah and started performing at the age of 14. He toured the length and breadth of the country popularising the art form and gave over 12,000 performances. Though unlettered, Mr. Sattaiah was instrumental in disseminating information on government programmes and schemes and made millions think.

While Oggu Katha traditionally narrates ballads in the praise of Veera Bhadra the son of Lord Siva, Mr. Sattaiah was instrumental in using the art form for narrating social messages, starting with the 20-Point Programme launched by the then Prime Minister Indira Gandhi.

No photo description available.

Having got the opportunity, Sattaiah went ahead conquering what all he could. He adapted the ancient folk art form to create awareness among the masses on the need for adult education, family planning and more importantly on social evils such as dowry system, superstitions and bad habits.

Source: https://www.thehindu.com/news/national/telangana/oggu-katha-artiste-chukka-sattaiah-passes-away/article20061598.ece

No photo description available.

చుక్కా సత్తయ్య

డా. చుక్కా సత్తయ్య (మార్చి 29, 1935 – నవంబరు 9, 2017) ఒగ్గు కథ పితామహుడు, ఒగ్గుకళ సామ్రాట్. బీరప్పకథను ఒగ్గుకళలో విలీనం చేసి ఈ కళకే వన్నే తెచ్చాడు.శివ స్వరూపమైన వీర భద్రుడు విరోచిత కథను గానం చేయడమే ఒగ్గు కథ అంటారు.

ఒగ్గుకథ ప్రస్థానం

తన తండ్రి నుంచి వారసత్వంగా పొందిన ఒగ్గుకథలో 14వ ఏటనే ప్రావీణ్యత సంపాదించాడు. 13 ఏళ్ల చిరుప్రాయంలోనే చిరుతల రామాయణంలోని హనుమంతుడి పాత్రను ధరించాడు. తనంతటతానుగా తెలుగులో చదవడం, వ్రాయడం నేర్చుకుని తనకున్న కళపై పట్టుతెచ్చుకొని తన 40 సంవత్సరాల ఒగ్గు కళా జీవితంలో దేశవిదేశాల్లో దాదాపు 12వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు. అంతేకాకుండా హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా లోని 1500లకు పైగా కళాకారులకు ఒగ్గుకళలో శిక్షణ ఇచ్చాడు.[ జనగాం కేంద్రంగా జ్యోతిర్మయి లలిత కళాసమితిని ఏర్పాటుచేసి ఎందరో కళాకారులను తయారుచేశాడు.

No photo description available.

నుదట రెండు పాదాల మాదిరిగా (చుక్క) ఉంది. ఆ ‘చుక్కా’ సత్తయ్య ఇంటి పేరుగా మారింది. మల్లన్నకథ, బీరప్ప కథ, ఎల్లమ్మకథ, మాందాలు కథ, నల్ల పోషమ్మ కథ,దుర్గమ్మ కథ,సౌడలమ్మ కథ,ఉప్పలమ్మ కథ,మైసమ్మ కథ,కీలుగుర్రం కథ, లక్ష్యాగృహం కథ, పెద్దిరాజు పెద్దమ్మ కథ, ఎర్రగొల్ల అక్కమ్మకథ, కనకతార కథ, కాంభోజరాజు కథ, అల్లిరాణి కథ, గయోపాఖ్యానం, రంభ రంపాలా, అయిదు మల్లెపూల కథ, గౌడ పురాణం, సమ్మక్క కథ, మండోదరి కథ, ఇప్పరాపురిపట్నంకథ, సూర్యచంవూదాదుల కథ, బాలనాగమ్మ కథ, సత్యహరిశ్చంద్ర మహారాజు కథ, సత్యవతి కథ, సిరికొండ మహారాజు కథ,అపురూపవతి కథ,మైనవతి కథ,సారంగధర కథ,అమరశీల మహరాజు కథ,పూరుర్వ చక్రవర్తి కథ,మౌనధరి కథ,బాబాషబాబాషాదుల్ల కథ,శివకొమార కథ,సుగుణవతి కథ,సారంగధరమెటసారంగధర కథ,అట్కరొల్ల కథ,వీరభగవంతి కథ,వానదేవుని కథ,సిరిదేవి కథ, రామాయణం, మయసభ, కంసవధ, భస్మాసుర వధ, భక్త ప్రహ్లాద మొదలైన కథలను ఒగ్గుకథలుగా చెప్పేవాడు.

No photo description available.

పురస్కారాలు – గౌరవాలు

No photo description available.
  1. కేంద్ర సంగీత నాటక అకాడమీ (అబ్దుల్ కలాం చేతులమీదుగా 2004)
  2. డాక్టరేట్ (కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్, 2005 ఏప్రిల్ 15)
  3. ప్రతిభా పురస్కారం (తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్)
  4. ఒగ్గు కళా సామ్రాట్ (వెంకటేశ్వర క్యాసెట్ సెంటర్)
  5. జానపద కళామూర్తి (యాత్రి కృష్ణారావు, ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టర్, విశాఖపట్టణం)
  6. మకుటంలేని మహారాజు (డిస్కో రికార్డంగ్ కంపెనీ, సికింద్రాబాద్)
  7. రాజీవ్‌ జీవన సాఫల్య పురస్కారం
  8. కళాసాగర్ (విశిష్ట పురస్కారం)
  9. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ‘ఒగ్గు చుక్క’ పేరుతో సత్తయ్యపై డాక్యుమెంటరీని రూపొందించింది.
  10. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు – 2015 అవార్డు – హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2
No photo description available.